తెలంగాణ

telangana

ETV Bharat / state

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన - manchirial

తన భూమి కబ్జా చేశారంటూ... మంచిర్యాల జిల్లాలో వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అధికారుల హామీతో కిందికి దిగి వచ్చాడు.

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన

By

Published : Jul 21, 2019, 3:20 PM IST

మంచిర్యాల జిల్లా భీమారంలో రమేష్​ అనే వ్యక్తి వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మండల కేంద్రంలోని 13 గుంటల భూమిని తెరాస నాయకుడు కబ్జా చేశాడని ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. నినాదాలు చేస్తూ అరగంటసేపు ట్యాంక్​పైనే ఉండి నిరసన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలానికి పోలీసులు, తహసీల్దార్​ చేరుకొని బాధితునితో మాట్లాడి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కిందికి దిగి వచ్చాడు.

భూమి కబ్జా చేశారని ట్యాంక్​ ఎక్కి నిరసన

ABOUT THE AUTHOR

...view details