తెలంగాణ

telangana

ETV Bharat / state

నస్పూర్​లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం - NEW PS INAUGRATION

వివిధ జిల్లాల్లోని 115 ఠాణాలకు భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.237.12 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ మంచిర్యాలలో తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం
మంచిర్యాల జిల్లాలో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం

By

Published : Mar 6, 2020, 1:31 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్​లో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ భారతీ హోళీ కేరి, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే దివాకర్ రావు, రామగుండం సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో 3753 చదరపు అడుగుల స్థలంలో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. ఒక్కో పోలీస్ స్టేషన్ నిర్వహణకు నగరాల్లో నెలకు రూ.75 వేలు , జిల్లా కేంద్రాల్లో రూ.50 వేల, మండలాల్లో రూ.25 వేలను అందిస్తోందన్నారు.

భయాన్ని పోగొట్టడమే లక్ష్యం...

ఠాణా అన్నా, పోలీసులన్నా ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టి ప్రజలకు స్నేహితులుగా సేవచేసే విధంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు. నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్​లను ప్రభుత్వం ఆధునీకరించిందని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

అత్యాధునిక సాంకేతికత...

పంజాగుట్ట, గచ్చిబౌలి, ఆదిభట్ల ఠాణాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల సీఎం, ఉన్నతాధికారులు సందర్శించి రాష్ట్ర పోలీస్ వ్యవస్థను అభినందించారని కోలేటి దామోదర్ రావు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లాలో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం

ఇవీ చూడండి : మత్తులో విచ్చలవిడి వినోదం.. ఆపై ఘర్షణలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details