మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐబీ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జోరు వర్షంలోనూ డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ వేషధారణ, సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోడు భూముల్లో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై తెరాస ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. జిల్లాలో ఆదివాసి భవన్ నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు.
ఆదివాసిభవన్కు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే - ఆదివాసిభవన్కు 25 లక్షలిచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ప్రపంచ ఆదివాసీ దినోత్సం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ఆదివాసీల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. జిల్లాలో ఆదివాసీ భవన్కు రూ. 25 మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఆదివాసిభవన్కు 25 లక్షలిచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఆదివాసిభవన్కు 25 లక్షలిచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఇవీ చూడండి: కాళేశ్వరానికి మరో రూ.4 వేల కోట్ల రుణం
TAGGED:
MLA DURGAM CHINNAYYA