తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగునీటికి అటవీ అడ్డంకులు.. అన్నదాతల అవస్థలు

కడెం ఆయకట్ట కింద వచ్చే సాగు నీటికి అటవీ అధికారులు అడ్డుకట్ట వేశారని జన్నారం మండలం మహ్మదాబాద్ రైతులు వాపోయారు. అధికారుల తీరుతో తమ పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

farmers-allegations-on-forest-officers-for-irrigation-at-mahmadabad-in-mancherial-district
'సాగు నీటికి అటవీ అధికారుల అడ్డుకట్ట... ఎండిపోతున్న పంటలు'

By

Published : Jan 19, 2021, 11:36 AM IST

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహ్మదాబాద్ అనే గ్రామంలో యాసంగి పంటకు నీళ్లొస్తాయనే నమ్మకంతో కడెం ఆయకట్టులోని వందలాది ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. వారబందీ పద్ధతిలో సరిపడినంత సాగు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక రైతులు వాపోయారు. 18బి కాల్వ ద్వారా రావాల్సిన సాగు నీటికి అడ్డుకట్ట వేసి అటవీశాఖ అధికారులు... అడవిలో నూతనంగా నిర్మించిన కుంటకు నీటిని మళ్లించుకున్నారని ఆరోపించారు.

అటవీ అధికారుల చర్యల వల్ల పొలాలకు రావాల్సిన నీరు రాక... పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైపులను వినియోగించి తమ పొలాలకు రావాల్సిన సాగునీటిని అక్రమంగా కుంటలోకి మళ్లించుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

ఇదీ చదవండి:ఆయిల్ ఫామ్ సాగు​కు చెన్నూరు అనుకూలం: మంత్రి నిరంజన్

ABOUT THE AUTHOR

...view details