తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులు వినూత్నంగా మొక్కల పంపిణీ - మొక్కలు చేతబట్టారు

నిత్యం తుపాకులు, లాఠీలు చేతబూని కాలనీలను నిర్బంధించి తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేసే పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో తుపాకులు విడిచి.. మొక్కలు చేతబట్టారు.

పోలీసులు వినూత్నంగా మొక్కల పంపిణీ

By

Published : Aug 5, 2019, 7:29 PM IST

ఆయుధాలను పక్కనపెట్టి, మొక్కలను చేతబట్టి కాలనీల్లో తిరుగుతూ వాటిని పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలంటూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సీఐ ఎడ్ల మహేష్, ఎస్ఐ శివ కుమార్​ సహకారంతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా విద్యార్థులు, మహిళలతో కలిసి మొక్కలు నాటారు. కాలనీల్లో తిరుగుతూ సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. స్వయంగా పోలీసులే ఇంటికి వచ్చి మొక్కలను అందించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.

పోలీసులు వినూత్నంగా మొక్కల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details