రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకుండా మోసం చేసిందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేట జాతీయరహదారిపై రైతులతో ఆందోళన నిర్వహించారు.
రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది: సురేఖ
రాష్ట్రప్రభుత్వం సన్న వరికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఆరోపించారు. జిల్లాలోని లక్సెట్టిపేటలో క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలంటూ జాతీయరహదారిపై ధాన్యం కుప్పలు పోసి నిరసన వ్యక్తం చేశారు.
రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది: సురేఖ
రాష్ట్రప్రభుత్వం సన్నవరికి గిట్టుబాటు ధర కల్పించకుండా కర్షకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. క్వింటాలు ధాన్యానికి రూ.2500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.