తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ బరిలో 11 మంది అభ్యర్థులు..

నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసినందున ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఆదిలాబాద్​ పార్లమెంట్​ స్థానంలో 17 నామినేషన్లు దాఖలు కాగా.. చివరకు 11 మంది బరిలో నిలిచారు.

ఆదిలాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు

By

Published : Mar 30, 2019, 6:25 PM IST

Updated : Mar 30, 2019, 9:09 PM IST

ఆదిలాబాద్‌ లోక్​సభ స్థానం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 18 నుంచి 25 వరకు మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నలుగురు అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి నరేశ్​జాదవ్‌ సహా, భారతీయ బహుజన క్రాంతీదళ్‌ అభ్యర్థి ఆడె బాలాజీ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీలైన తెరాస తరఫున సిట్టింగ్‌ ఎంపీ గోడం నగేశ్​, కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ రాఠోడ్‌, భాజపా నుంచి సోయం బాపురావుతో పాటు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో తొలిసారిగా జనసేన తరపున జేఎన్‌టీయూ విద్యార్థి దారవత్‌ నరేందర్ పోటీ పడుతున్నారు. బరిలో ఉన్న 11 మందిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులే. నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసినందున, ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టడం వల్ల రాజకీయంవేడెక్కుతోంది.

ఆదిలాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఇవీ చూడండి:ఒకరికి ఒకరు తోడుగా...ప్రచారంలో అండగా

Last Updated : Mar 30, 2019, 9:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details