తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy Fires on CM KCR : 'కేసీఆర్‌.. రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులిస్తున్నారు' - బీఆర్​ఎస్​ పై కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy Fires on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి.. రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు.

Kishanreddy
Kishanreddy

By

Published : May 20, 2023, 3:48 PM IST

Updated : May 20, 2023, 5:23 PM IST

Kishan Reddy Fires on CM KCR : పంటల బీమా పథకం అమలు చేయాలని.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకునే పరిస్థితి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మినహా.. అన్ని రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మహబూబ్​నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు..: రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం కేవలం ఎరువుల రాయితీ రూపంలోనే ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తోందని అన్నారు. అవి కాకుండా అదనంగా మరో రూ.6 వేలు సహా ఇతర రాయితీలు కూడా రైతులకు ఇస్తోందని గుర్తు చేశారు. ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని చెబుతున్న కేసీఆర్ సర్కార్.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతే పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసం, సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసిన కేసీఆర్​కు.. పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న స్పృహ లేదన్నారు.

కొండా వ్యాఖ్యలపై స్పందించిన కిషన్​రెడ్డి..: కేంద్రం సహకారంతో ఇతర రాష్ట్రాల్లో నిరుపేదల కోసం లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం రెండు పడక గదుల ఇళ్లు దిక్కులేవని కిషన్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్​తో ముడిపడిన తెలంగాణ పదాన్ని సైతం పార్టీ పేరు నుంచి తొలగించారన్నారు. ఈ క్రమంలోనే దేశ హితం కోసమే రూ.2 వేల నోట్లను దశల వారీగా ఉపసంహరించుకున్నారని, ఆ విషయంలో జనం ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గలేదని చెప్పారు. కవిత అరెస్ట్ విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత అరెస్టు వ్యవహారం దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, కేంద్రానికి గానీ, పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని కిషన్​రెడ్డి అన్నారు.

'తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయి. కేసీఆర్‌ రాష్ట్ర రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారు. ఎరువుల రాయితీ కోసం కేంద్రం రూ.లక్ష కోట్లు కేటాయించింది.పెరిగిన ధరల ప్రభావం రైతులపై పడకూడదని రాయితీ పెంచింది. ఒక్కో ఎరువుల సంచిపై కేంద్రం రూ.2 వేలకు పైగా రాయితీ ఇస్తోంది. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదు.'-కిషన్​రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఆ ఘనత మోదీ ప్రభుత్వానిదే : తెలంగాణలో బీజేపీలోకి చేరికలు ఏ మాత్రం ఆగలేదని.. అవి కొనసాగుతాయని కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను 'మహాజన్ సంపర్క్ అభియాన్' ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. రామజన్మ భూమి, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ లాంటి ధీర్ఘకాల సమస్యల్ని పరిష్కరించామని గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీలు, ఎగుమతులను ప్రోత్సహించామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో ఏకకాలంలో 10 శాతం పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 20, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details