తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల వద్దకే పోలీసింగ్: ఎస్పీ రెమా రాజేశ్వరి - ఎస్పీ రెమా రాజేశ్వరి

పాలమూరు జిల్లా కేంద్రంలో 'సేవ్ మహబూబ్​నగర్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

'సేవ్ మహబూబ్​నగర్'

By

Published : Jul 29, 2019, 7:43 PM IST

పోలీసులే ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునే విధంగా 'సేవ్‌ మహబూబ్‌నగర్‌' కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. కాలనీలు, గ్రామాలలో అక్కడి పరిస్థితులతో పాటు కొత్తగా వచ్చే వ్యక్తుల సమాచారం, నేరస్తులు, దొంగతనాల వివరాలను రాబడుతున్నట్టు వివరించారు. ప్రజలకు ఉన్న అవసరాలు తెలుసుకుని, వచ్చి పోయే వారిపై సమాచార సేకరణ కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్లలో రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. ఒకరు జిల్లా వాసి కాగా.. మరొకరు అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరి నుంచి 3లక్షల 48వేల విలువైన పది మోటార్ సైకిళ్లను, 2లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

సేవ్ మహబూబ్​నగర్

ABOUT THE AUTHOR

...view details