రైలులో భారీ సంఖ్యలో మగ పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 28 పిల్లలను రక్షించారు. వీరంతా బిహార్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో విద్యనభ్యసించేందుకు తీసుకెళ్తున్నట్లు మదర్సా నిర్వహకులు పోలీసులకు తెలిపారు. కానీ అందుకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించగా... వాటికి పొంతన లేకపోవడం.. చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్నారుల వివరాలను సేకరించిన తర్వాత వారిని కుటుంబసభ్యులకు అప్పగించాలా.. లేక మదర్సాకు పంపాలా అనే నిర్ణయాన్ని అధికారులు తీసుకోనున్నారు.
రైలులో తరలిస్తున్న 28మంది పిల్లలను రక్షించిన పోలీసులు
కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న రైలులో అక్రమంగా తరలిస్తున్న 28 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. వీరిని బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.
రైలులో తరలిస్తున్న 28 పిల్లలను రక్షించిన పోలీసులు
TAGGED:
mahaboobnagar