ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్... ఇక్కట్లలో రోగులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటంతో.. నాలుగు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. చీకటి పడటంతో వార్డుల్లో ఉండలేక ఆరుబయటకు వచ్చి కూర్చున్నారు. ఇక మహిళలు, చిన్నారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రసూతి వార్డులల్లో గాలి, వెలుతురు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆసుపత్రి సిబ్బందికి చెప్పిన స్పందించడం లేదంటూ మండిపడ్డారు.
TAGGED:
no power