తెలంగాణ

telangana

అప్రమత్తంగా ఉండండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Apr 10, 2020, 10:37 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 32 మందికి కరోనా సోకిందని చెప్పారు.

minister srinivas goud speak about corona situation in mahabubnagar district
అప్రమత్తంగా ఉండండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో మొత్తం 32 కరోనా కేసులు నమోదు అయినట్లు ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహబూబ్​నగర్​ జిల్లాలో11, నాగర్ కర్నూల్​లో 2, జోగులాంబ గద్వాల జిల్లాలో 19 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇంట్లో నుంచి బయటకురావొద్దని, భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఎవరైనా నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవటం సహా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా హోం క్వారంటైన్​లో ఉన్న వారి ఇంటికెదురుగా రెడ్ కలర్ స్టిక్కర్​ అతికిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్​ రావు తెలిపారు.

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details