తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే వినాయక చవితికి కరోనా పూర్తిగా వెళ్లిపోవాలి: మంత్రి శ్రీనివాస్‌ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తాజా వార్తలు

వచ్చే వినాయక చవితి నాటికి రాష్ట్రంలో, దేశంలో కరోనా పూర్తిగా వెళ్లిపోయేలా స్వామివారిని పూజించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రజలను కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వినాయక భవన్‌కు శంకుస్థాపన చేశారు.

వచ్చే వినాయక చవితికి కరోనా పూర్తిగా వెళ్లిపోవాలి: మంత్రి శ్రీనివాస్‌
వచ్చే వినాయక చవితికి కరోనా పూర్తిగా వెళ్లిపోవాలి: మంత్రి శ్రీనివాస్‌

By

Published : Aug 22, 2020, 7:47 PM IST

తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వినాయక భవన్‌కు శంకుస్థాపన చేశారు.

వినాయక భవన్‌కు మంత్రి శంకుస్థాపన

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లల్లోనే వినాయక చవితి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వచ్చే వినాయక చవితి నాటికి రాష్ట్రంలో, దేశంలో కరోనా పూర్తిగా వెళ్లిపోయేలా స్వామివారిని పూజించాలని ప్రజలను కోరారు.

కమ్మూనిటీ భవన్​కు శంకుస్థాపన

అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో నిర్మించనున్న వినాయక కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. పాతపాలమూరు, రాంనగర్‌లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుల దగ్గర నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

గణేశ్​ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details