తెలంగాణ

telangana

ముంపు బాధితులతో మంత్రి చర్చలు విఫలం

By

Published : Mar 10, 2020, 11:13 PM IST

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్​నగర్ జిల్లాలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయం పనులను నిలిపివేస్తూ బాధిత గ్రామాల ప్రజలు గత 14 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. పనులు సాగేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో చర్చించారు. కానీ వారి చర్చలు సఫలం కాలేదు.

minister srinivas goud discus with Land expatriates
ముంపు బాధితులతో మంత్రి చర్చలు విఫలం

మహబూబ్​నగర్ జిల్లాలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయం పనులను నిలిపివేస్తూ బాధిత గ్రామాల ప్రజలు గత 14 రోజులుగా రిలే నిరాహారదీక్షలకు దిగారు. పనులు సాగేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో చర్చించారు.

తాము సీఎం కేసీఆర్​తో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని తమని నమ్మండి అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. కాంగ్రెస్, భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. కానీ వారి చర్చలు సఫలం కాలేదు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.

ముంపు బాధితులతో మంత్రి చర్చలు విఫలం

ఇదీ చదవండి:'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'

ABOUT THE AUTHOR

...view details