ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాజోలి గ్రామానికి చెందిన సుమారు 37 మందికిపైగా కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని మేడికొందూరు మండలంలో మిరప పొలాల్లో పనిచేసేందుకు జనవరిలో వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక 40 రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు.
సారూ.. మా ఊరికి తీసుకెళ్లండి - mahabubnagar district people struck in Andhara pradesh state
పొట్టకూటి కోసం వలసవెళ్లిన కూలీలు.. 40 రోజులుగా లాక్‌డౌన్‌తో సొంత గ్రామానికి రాలేక, పనికెళ్లినచోట ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.
mahabubnagar district people struck in Andhara pradesh state
వారితోపాటు ఉంటున్న అదే రాష్ట్రానికి చెందిన కూలీలను అక్కడి అధికారులు తరలిస్తున్నా.. మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. గుడారాల్లో ఎండ, ఈదురుగాలులతో దుర్బరజీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాతోపాటుగా సాతర్ల, వెంకటాపురం, ముండ్లదిన్నె గ్రామాలకు చెందిన కూలీలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రాజోలి కూలీలు ఈటీవీ భారత్కు వివరించారు.