KTR On Palamuru Rangareddy Project :పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. తాగడానికి, సాగుకు నీరు లేక మహబూబ్‌నగర్ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని... ఇప్పుడు వాటన్నింటికి స్వస్తి పలికే సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ..పల్లేర్లు మొలిచిన పాలమూరులోపాలనురగల జలహేల!
వలసల వలపోతల గడ్డపైన
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం!
కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో ..
కృష్ణమ్మ జల తాండవం!
శెలిమలే దిక్కైన కాడ
ఉద్దండ జలాశయాలు..!
బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు ..!
స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ
సాగునీటి సన్నివేశం..!
ఆరు జిల్లాలు సస్యశ్యామలం
దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం!
నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ !
నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..!
నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం !
సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం!
బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను
బీడు భూములకు రప్పించేందుకు
స్వయం పాలనలో సాహస యజ్ఞం!
ఆటంకాలు అవరోధాలు అధిగమించి..
ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి
సవాల్ చేసి సాధించిన విజయం!
నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం
అనుమతుల్లో అంతులేని జాప్యం
ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం!
తీరిన దశాబ్దాల నీటి వెత
తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!
Palamuru Rangareddy Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డితో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1200పైగా గ్రామాలకు తాగునీరు
Harish Rao Tweet On Palamuru Project : కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దశాబ్దాల కల... తరతరాల ఈ ప్రాంతవాసుల ఎదురుచూపులు... నెరవేరే సమయం ఆసన్నమైందని.. కొద్దిసేపట్లో నీరు ఉబికిరానున్నాయని ట్వీట్ చేశారు. 'ెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుందని సంతోషం వ్యక్తం చేశారు. 'ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలస బతుకులు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన విధ్వంసం... నాడు పాలకులు మారినా పాలమూరు బతుకులు మాత్రం మారలేదు. తాగు, సాగు నీటికి తండ్లాట తప్పలేదు' అని హరీశ్ రావు ట్వీట్లో పేర్కొన్నారు.
Minister Niranjan Reddy on Palamuru Rangareddy Project : మరోవైపు పాలమూరు.. దశ, దిశను మార్చేప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నీటి విషయాల్లో ఓనమాలు తెలియని వారు ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన మంత్రి .. ఈ శతాబ్దపు మానవాద్భుత నిర్మాణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు.
Palamuru Rangareddy Project Inauguration :ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర అన్న ఆయన.. 27 వేల ఎకరాల భూసేకరణ, 5 రిజర్వాయర్ల నిర్మాణం, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జిపూల్ల నిర్మాణం, నాలుగు 420 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. గత పాలకుల మాదిరిగా చేసి ఉంటే వందేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తి అయుండేది కాదని విమర్శించారు. ప్రజలంతా నేటి కార్యక్రమానికి హాజరవడమే కాకుండా తిరిగి వచ్చే క్రమంలో కలశాలలో కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లి.. రేపు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో కృష్ణమ్మ నీళ్లతో దేవతామూర్తులను అభిషేకించాలని మంత్రి కోరారు.
MahaBahubali Pumps Palamuru Rangareddy Project : మహాబాహుబలి పంపులు.. నీటిని ఎలా ఎత్తిపోస్తాయో తెలుసా..?
Palamuru Rangareddy Project Dry Run : తుదిదశకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు... వారం రోజుల్లో డ్రై రన్