తెలంగాణ రాకుంటే నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో జరిగిన జలశక్తి అభియాన్ కిసాన్ మేళాలో వారు మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో తెలంగాణలో నీరు పుష్కలంగా ఉందన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నీటిని పొదుపు చేయకుంటే తీవ్ర ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. అందుకే ప్రతిఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని కోరారు. కేంద్రం జలశక్తి అభియాన్ పేరుతో ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
"తెలంగాణ రాకుంటే నీటికి అవస్థలు పడేవాళ్లం"
నీటిని పొదుపు చేయకుంటే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో జరిగిన జలశక్తి అభియాన్ కిసాన్ మేళాలో పాల్గొన్నారు.
శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి