తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలి'

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని కరోనా బాధితులకు విటమిన్‌-సీ ద్రావణాలను జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నూకల వెంకటేశ్వర్‌ రెడ్డి పంపిణీ చేశారు. కొవిడ్​ బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

vitamin-c medicine distributed in danthalapally
vitamin-c medicine distributed in danthalapally

By

Published : Aug 29, 2020, 6:41 AM IST

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల, దంతాలపల్లి గ్రామాల్లో కరోనా వైరస్‌ సోకిన బాధితులకు ఎంపీ కవిత సమకూర్చిన మల్టీ విటమిన్‌ ద్రావణాల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లి ద్రావణాల ప్యాకెట్లను అందజేశారు.

కరోనా వైరస్‌ సోకిన వారు ధైర్యంతో ఉండాలని వెంకటేశ్వర్​రెడ్డి సూచించారు. కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సంపెట రాము, రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త మల్లారెడ్డి, సర్పంచి సుస్మితతో పాటు తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details