'విద్యార్థులకు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు' - tenth
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని నింపారు. విద్యార్థులు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సూచించారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆందోళన చెందవద్దని అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ తిరిగి సప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు.. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.