తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో రోడ్డెక్కిన విద్యార్థులు

తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ మహబూబాబాద్​లో  విద్యార్థులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

విద్యార్థులు

By

Published : Jul 24, 2019, 6:34 PM IST

మహబూబాబాద్​లోని గిరిజన వసతి గృహ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధర్ థెరిస్సా సెంటర్​లో రాస్తారోకో చేశారు. హాస్టల్​లో కనీస వసతులు కల్పించాలని, అధికారులు వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. 80 మంది విద్యార్థులకు 3 గదులే ఉన్నాయన్నారు. మరుగుదొడ్లు సరిపడా లేకపోవడం వల్ల బయటకు వెళ్తున్నామని తెలిపారు. విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

మహబూబాబాద్​లో రోడ్డెక్కిన విద్యార్థులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details