Sudden Rains in Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం నుంచి వర్షపునీటిని తొలగించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కోతలు పూర్తయి నెల గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sudden Rains: అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం - అకాల వర్షం వార్తలు
Sudden Rains in Mahabubabad: అకాల వర్షం అన్నదాతలకు కన్నీటిని మిగిల్చింది. నెల రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా కొనుగోలు సెంటర్ల వద్ద.. ధాన్యాన్ని కాపాడుకుంటుంటే.. అకాల వర్షం ఆశలను నీరుగార్చేసిందని రైతన్నలు వాపోతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోగా... రాత్రి కురిసిన వర్షం మరోసారి నష్టాలపాలు చేసిందని రైతులు వాపోయారు. పంట సాగు కంటే... అమ్మేందుకు పడే కష్టం పదింతలు అవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరునెలల కష్టం కన్నీటి పాలవుతున్నా పాలకులకు పట్టాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకువచ్చి నెలరోజులు అవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:Grain Purchase Issues: వణుకుతున్న రైతులు.. నిద్దరోతున్న అధికారులు