మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు బానోత్ ప్రేమ్ లాల్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అతను మే 6 న తన సోదరుని వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.
కరోనాతో ప్రవాస భారతీయుడు మృతి - కరోనాతో ప్రవాస భారతీయుడు మృత్యువాత
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామానికి చెందిన బానోత్ ప్రేమ్‌లాల్ తన సోదరుని వివాహం కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.
కొవిడ్‌తో ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
తీవ్రమైన జ్వరం రావడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి ఆస్పత్రి వైద్యుని సూచనలతో హైదరాబాద్‌కు తీసుకురాగా కోలుకోలేక మృతి చెందాడు. ఇప్పటికే మైలారం గ్రామంలో అతని తల్లితండ్రులకు సైతం కొవిడ్ పాజిటివ్‌గా రాగా... మరో 15 మంది బాధితులు ఉన్నారు. మృతునికి భార్య, ఓ కూతురు ఉంది.