మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపల్లి శివారు తుమ్మలచెరువు తండాలో విషాదం చోటు చేసుకుంది. విస్సంపల్లి ఎంపీటీసీ బానోత్ వెంగళ్రావు(29) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. చెరువులోకి దిగిన పశువులను బయటకు రప్పించేందుకు వెంగళ్రావు అందులోకి దిగాడు.
చెరువులో మునిగి మృతిచెందిన ఎంపీటీసీ - DEAD NEWS
చెరువులో దిగిన పశువులను బయటకు రప్పించేందుకు నీటిలో దిగిన ఆ వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. ఈ విషాదం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం తుమ్మల చెరువు తండాలో జరిగింది. మృతుడు విస్సంపల్లి ఎంపీటీసీగా గుర్తించారు.
చెరువులో మునిగి మృతిచెందిన ఎంపీటీసీ
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా... లాభం లేక నీట మునిగి మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. విషయం తెలిసి ఘటనా స్థితికి చేరుకున్న కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంగళ్రావుకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.