రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరా పెన్షన్ల కింద రూ. 3016 ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆల్మికో సంస్థ సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లను పంపిణీ చేశారు.
దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం: మంత్రి సత్యవతి - Minister Satyavathi Rathode
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశమయ్యారు. ఓ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఆమె వివరించారు.
దివ్యాంగుల బ్యాటరీ ట్రై సైకిల్
గతంలో కృత్రిమ అవయవాల కోసం రాజస్థాన్ వరకు వెళ్ళాల్సి వచ్చేదన్నారు మంత్రి. ప్రస్తుతం అంత దూరం వెళ్లకుండా మన దగ్గరే వాటిని తయారు చేసుకుంటున్నామని వివరించారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి 159 మందికి వాహనాలను పంపిణీ చేసిన ఆల్మికో సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా సంక్షేమ అధికారి సబిత, జడ్పీ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో రెండేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం : షర్మిల