తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ ప్రజలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని... ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు.
తెరాస ఆవిర్భావ దినోత్సవాన రక్తదాన శిబిరం ఏర్పాటు - MINISTER SATHYAVATHI RATHODE LATEST NEWS
రేపు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
తెరాస ఆవిర్భావ దినోత్సవాన రక్తదాన శిబిరం ఏర్పాటు
తెరాస పార్టీ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకొని, అందరితో కలిసి అడుగులు వేస్తున్న పార్టీ అని మంత్రి తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువకులంతా రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'
TAGGED:
MINISTER SATHYAVATHI RATHODE