మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తోట పని చేసి, చెట్లకు నీళ్లు పోసి, వ్యర్ధ పదార్థాలను తొలగించారు. చీపిరి పట్టి ఊడ్చి.. కార్యాలయంను శుభ్రపరిచారు.
కార్యాలయాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్ - minister ktr
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పారిశుద్ధ్య పనులు చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చీపురు పట్టి కార్యాలయాన్ని శుభ్రం చేశారు.
కార్యాలయాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజా ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి, తెలంగాణ ప్రజానీకం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అంటువ్యాధుల నివారణ కోసం ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాను శుభ్రతను పాటిస్తూ... నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను ఉంచుకునే విధంగా చేసుకునేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు.
ఇవీ చూడండి: 'ఆదివారం ఉ.10 గంటలకు'... దోమల స్థావరాలు ధ్వంసం చేసిన కేటీఆర్