తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కలను పిల్లలుగా పెంచితే...తల్లి లాగా కాపాడుతాయి' - mahabubabad district

మహబూబాబాద్ జిల్లాలో న్యాయశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ర్యాలీ చేపట్టారు. అనంతరం కోర్టు సముదాయం నుంచి పట్టణంలోని గాంధీ పార్కు వరకు ప్లకార్డులు పట్టుకుని పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

న్యాయశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ర్యాలీ

By

Published : Jun 6, 2019, 10:24 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయమూర్తి అనిల్ కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రాధిక జైశ్వాల్​లు మొక్కలు నాటారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి, చెట్లను పెంచాలని అంటూ నినాదాలు చేశారు. అనంతరం గాంధీ పార్కులో మొక్కలు నాటారు. మొక్కలను పిల్లలుగా భావించాలని, అవి తల్లి లాగా కాపాడుతాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ప్లకార్డులు పట్టుకుని పర్యావరణంపై అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details