మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని అభ్యాస్ పాఠశాలలో వినూత్నంగా సంబురాలు నిర్వహించారు. విద్యార్థుల నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలను పాఠశాలకు ఆహ్వానించి వేడుకలు జరిపారు. మనువళ్లు మనువరాళ్లకు ఆటలు నేర్పించిన వాళ్లనే కాసేపు చిన్నపిల్లలను చేసి సరదాగా ఆటలాడించారు. చిన్నారులతో పాటు నానమ్మ-తాతయ్యలతోనూ స్టేప్పులేయించారు.
స్కూల్లో వినూత్న వేడుక... చిన్నపిల్లలైన తాతయ్యలు, నానమ్మలు
మనువళ్లు, మనువరాళ్లను ఒళ్లో వేసుకుని ఆటలాడించే తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు కాసేపు చిన్నపిల్లలయ్యారు. తమ వయసును మరిచిపోయి ఆటలాడుతూ పరవశించిపోయారు. తమ మనువళ్లతో కలిసి నృత్యాలు చేస్తూ... సంబురపడ్డారు. ఆ చిన్నారులు తమను గౌరవిస్తూ... చేసిన పాద పూజకు ఉప్పొంగిపోయారు. ఈ అద్భుత ఘట్టానికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అభ్యాస్ పాఠశాల వేదికైంది.
GRAND PARENTS BECOME CHILDREN IN THEIR GRAND CHILD SCHOOL ABHYAS
ఉత్సహంగా పాల్గొన్న జంటలకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందించింది. మనువళ్లు, మనువరాళ్లతో ఉపాధ్యాయులు పాద పూజ చేయించారు. అనంతరం వచ్చిన వృద్ధ జంటలందరినీ యాజమాన్యం శాలువాలు కప్పి సత్కరించింది.
కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తాతయ్యలు, నానమ్మలు ఆటలాడుతుంటే... మనువరాళ్లు, మనువళ్లు ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమాలతో పాఠశాల పరిసరాలు కోలాహలంగా మారాయి.
ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్
TAGGED:
ABHYAS SCHOOL CELABRATIONS