మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన నెమలి అశోక్ అనే యువకుడు తరచూ తన తండ్రి నెమలి వెంకటేశ్వర్లుతో గొడవ పడుతూ ఉండేవాడు. దీనితో విస్తుచెందిన అతను కొడుకును ఎలాగైనా హతమార్చేందుకు పథకం రచించాడు. ఈనెల 21వ తేదీ రాత్రి సమయంలో మద్యం సేవించి వచ్చి నిద్రలోకి జారుకున్న అశోక్‌పై హత్య ప్రయత్నం చేశాడు.
కన్న కొడుకును కాలరాసిన తండ్రి - కొడుకును చంపిన తండ్రి
కన్న కొడుకుని ఓ కసాయి తండ్రి హత్య చేశాడు. మెడకు విద్యుత్ తీగను బిగించి హతమార్చాడు. కుమారుడు తనకు తానే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తన ప్రియురాలితో కలిసి పథకం ప్రకారం అందరిని నమ్మించారు.. కానీ తల్లి అనుమానంతో చివరకు కటకటాల పాలయ్యారు.
నిద్రమత్తులో ఉన్న అశోక్ మెడకు విద్యుత్ సర్వీసు తీగ చుట్టి హత్య చేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలైన బానోతు అమ్మికి చెప్పి.. ఇద్దరు కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. అశోక్ స్వయంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రజలను నమ్మించేందుకు ఫ్యానుకు చీర కట్టి అశోక్‌ను ఉరివేశారు. ఏమీ ఎరుగనట్టు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పి లబోదిబోమని రోదించారు.
అశోక్ మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి నెమలి చుక్కమ్మ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లే తన కొడుకును హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడికి ఉరి వేసేందుకు సహకరించిన అమ్మితో పాటు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం