తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతిభ ద్రతలపై భరోసా కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

మహబూబాబాద్‌ జిల్లాలో తొర్రూర్​ డీఎస్పీ మదన్​లాల్​ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

శాంతిభద్రతలపై భరోసా కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

By

Published : Sep 28, 2019, 11:51 AM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో తొర్రూర్​ డీఎస్పీ మదన్​లాల్​ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 1 ట్రాక్టర్​తో పాటు అక్రమంగా విక్రయిస్తున్న రూ.40 వేల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలకు పాల్పడితే బాధ్యులైన వారిపై కేసులతో పాటు కఠిన చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ మదన్‌లాల్‌ పేర్కొన్నారు. ప్రజలకు శాంతిభద్రతల పై భరోసా కల్పించేందుకే ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 75 మంది పోలీస్​ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

శాంతిభద్రతలపై భరోసా కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

ABOUT THE AUTHOR

...view details