మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రానికి చెందిన పిల్లి రేణుక, మల్లయ్య దంపతులకు 2005 సంవత్సరంలో ఝాన్సీ జన్మించింది. తల్లి రేణుక అనారోగ్యంతో మృతి చెందగా, తండ్రి మల్లయ్య మద్యానికి బానిసయ్యాడు. నాలుగు సంవత్సరాల ఝాన్సీని అనాథాశ్రమంలో చేర్పించారు. తర్వాత చిన్నారిని పలు ఆశ్రమాలకు మార్చారు. హైదరాబాద్ కాచిగూడలో చిల్డ్రన్స్ హోమ్‌లో చేరింది.
పదేళ్ల తర్వాత తండ్రి చెంతకు కూతురు
చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది... తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీనితో అనాథ ఆశ్రమాలే ఆ బాలికకు దిక్కయ్యాయి. ఆ వాతావరణంలోనూ ఇమడలేక పారిపోయింది. చివరకు అధికారులు బాలిక ఉనికిని కనిపెట్టి, కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
2019లో అక్కడి నుంచి తప్పించుకుంది. బాలల సంరక్షణ కమిటీ చొరవతో ఆమె చిరునామా గుర్తించి వరంగల్ బాలల సంక్షేమ కమిటీ ఛైర్మన్ .. పరశురాములు ఎదుట హాజరుపరిచారు. పాత ఫోటోలు, చిరునామాను ఝాన్సీకి చూపించగా నానమ్మ.... తాత ఫోటోలను గుర్తుపట్టింది. దీనితో ఝాన్సీని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. 8వ తరగతి చదువుతున్న ఝాన్సీని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బాగా కష్టపడి చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఝాన్సీకి సూచించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస
TAGGED:
Mahabubabad district news