Mahabubabad police special drive on helmet and mask: వాహనాదారుల రక్షణ కోసం మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసులు ఆదివారం విస్తృత తనిఖీ చేపట్టారు. పట్టణ సీఐ వెంకటరత్నం ఆధ్వర్యంలో పోలీసులు జిల్లా కేంద్రంలోని 5 ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం ధరించని వాహనదారులకు జరిమానా, దీంతో పాటు అనుమతి పత్రాలు లేని వాహనాలను, ట్రాఫిక్ నిబంధనలు పాటించని 329 మందిపై కేసులు నమోదు చేసి రూ.96,600 జరిమానా విధించారు.
తనిఖీల్లో ఎస్సైలు, వెంకన్న, రమాదేవి, ఇమ్మాన్యుయేల్, మునిరుళ్ల, ట్రాఫిక్ ఎస్సై గాలీబ్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, త్రిబుల్ రైడింగ్ వెళుతున్నవారిని ఆపడంతో తమను వదిలేయాలని ఓ మహిళ రోదిస్తూ వేడుకున్నారు. శిరస్త్రాణం ధరించని వాహనదారులు కొందరు పోలీసులతో వాగ్వాదం చేశారు. ఓ వాహనదారుడు రహదారిపై బైఠాయించారు.