తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాణాలను అరేచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నాం' - కుమురం భీం ఆసిఫాబాద్

మూడు, నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి.

వాగులు

By

Published : Sep 26, 2019, 7:28 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు, నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, పల్లెటూర్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో వాగులను దాటి వెళ్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగులను దాటాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్లడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ తమకు చేరడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాకపోకలకు అంతరాయం కలగకుండా రోడ్లను, వంతెనలను నిర్మించాలని కోరుతున్నారు.

'ప్రాణాలను అరేచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details