ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తోన్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో ధర్నా నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు.