తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్పీఎం కాగితపు మిల్లులో కార్మికుడికి తీవ్ర గాయాలు'

సిర్పూర్ కాగితపు మిల్లులో విధులు నిర్వహిస్తుండగా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించగా వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని కార్మిక ఆసుపత్రి ఈ.ఎస్.ఐకి తరలించారు.

బాధితుడిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం

By

Published : Jun 14, 2019, 6:15 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తోట పోచం అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గతంలో ఫినిషింగ్ విభాగంలో పని చేసే పోచంను 20 రోజుల క్రితం ఎస్పీఎం పరిశ్రమలో విధుల్లోకి తీసుకున్నారు. ఫినిషింగ్ విభాగంలో పనిచేసే పోచంకు ఫైబర్ లైన్ విభాగంలో విధులు కేటాయించారు.

సాయంత్రం 4గంటల ప్రాంతంలో విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఈ.ఎస్.ఐ ఆసుపత్రికి పంపించారు. ఈ.ఎస్.ఐ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమ ప్రతినిధులు బాధితుడిని హైదరాబాద్​లోని సనత్ నగర్ ఈ.ఎస్.ఐ.కి తరలించారు.

సిర్పూర్ కాగితపు మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడికి గాయాలు

ఇవీ చూడండి : శవం కోసం రాని బంధువులు

ABOUT THE AUTHOR

...view details