ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజు కొనసాగుతోంది. ఆసిఫాబాద్ డిపో ప్రవేశ ద్వారం వద్ద ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాలు, సీపీఐ, సీపీఎం, భాజపా, కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ముందస్తు సమాచారంతో ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు. గేటు ముందే కార్మికులు నినాదాలు చేస్తూ బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి దీక్షా శిబిరం వద్దకు ర్యాలీగా వెళ్లారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు విపక్షాల మద్దతు
కుమురం భీం ఆసిఫాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజు కొనసాగుతోంది. సమ్మెకు సీపీఐ, సీపీఎం, భాజపా, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలుపుతూ ఆందోళన చేశారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు విపక్షాల మద్దతు