కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని క్రైస్తవులందరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఏసు క్రీస్తు ప్రేమ అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే - MLA Koneru Konappa participating in Christmas celebrations
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు ప్రేమ అందరిపై ఉండాలని కోరారు.
ఏసు క్రీస్తు ప్రేమ అందరిపై ఉండాలన్న ఎమ్మెల్యే
పలు మండలాలతో పాటు కాగజ్ నగర్ పట్టణంలోని చర్చీలను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఏసు క్రీస్తు ప్రేమ, కరుణా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఏసుప్రభు దయతో తెలంగాణ వచ్చింది: పద్మా దేవేందర్ రెడ్డి