కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినాయకులు ఎంతో ప్రత్యేకం.. గణనాథుడిని సహజసిద్ధంగా దొరకే ఎర్రమట్టి, వరిగడ్డి, జనుమును ఉపయోగించి తయారు చేసి వాటినే పూజిస్తారు. విగ్రహాలను నిమజ్జనం చేసినా.. వీటిలో వాడే వస్తువులు ప్రకృతి ఒడిలో సులభంగా కలిసిపోయి పర్యావరణాన్ని ఎటువంటి కలగదంటున్నారు పట్టణవాసులు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం వల్ల కళలను బ్రతికించినట్లు అవుతుందని... ఎంతో మందికి ఉపాధికి దారి దొరుకుతుందని తయారీదారులు చెబుతున్నారు. మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని నినాదాలు చేస్తున్నారు.
రంగు వినాయకులు వద్దు.. మట్టి గణపతులే ముద్దు..
రసాయనాలు, రంగులతో తయారుచేసిన లంబోదరుని ప్రతిమలు వీరు వాడరు. ప్రకృతికి హాని కలగని వస్తువులతో విగ్రహాలను తయారుచేసుకుని వాటినే పూజిస్తారు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లావాసులు.
రంగు వినాయకులు వద్దు.. మట్టి గణపతులే ముద్దు..
TAGGED:
kumurambheem asifabad