కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మంగీ అటవీ ప్రాంతం పరిధిలోని తొక్కిగూడ గ్రామం వద్ద ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులపై పోలీసులు పోస్టర్లను ఆవిష్కరించారు. పలు ఆదివాసీగూడాల్లో పోస్టర్లను అంటించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి ఎవరు సహాయం చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా తెలియని వారు గ్రామాల్లోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మావోలకు సహకరించొద్దంటూ ఏజెన్సీలో పోలీసుల పోస్టర్లు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి అటవీ ప్రాంతంలోని పలు గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసులు పోస్టర్లను ఆవిష్కరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి ఎవరు సహాయం చేయకూడదని స్పష్టం చేశారు.
మావోలకు సహకరించొద్దంటూ గూడాల్లో పోస్టర్లు విడుదల చేసిన పోలీసులు
మంగి పరిధిలోని గ్రామాలతో పాటు ఎర్రబండ, పిట్టగూడా, కొలాంగూడా, గుట్టగూడా, తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామస్తులతో కలిసి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న వ్యక్తుల వివరాలతో కూడిన మావోయిస్టుల పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి వైపు పయనించాలని సూచించారు.
ఇవీ చూడండి : ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి