'ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు'
డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలోని అధికారిణులు హాజరయ్యారు.
డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి హాజరయ్యారు. బతుకమ్మ సంబురాలను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పూజా నిర్వహించి ప్రారంభించారు. జిల్లాలోని అధికారిణులు, మహిళా సిబ్బంది బతుకమ్మ సంబురాల్లో పాల్గొని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.