తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం - ఆసిఫాబాద్​లో ఎన్నికల ప్రచారం

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

election campaign in kumurambheem district
జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

By

Published : Jan 19, 2020, 9:57 AM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో అధికార తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీపడుతున్నారు. పలు పార్టీల ఇం​ఛార్జ్​లు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న తెరాస చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని ప్రతిపక్షం వారు అంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం చేస్తుండగా.. భాజపా అభ్యర్థుల తరపున డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాలుగు చోట్ల తెదేపా పోటీచేస్తుంది. ఆ పార్టీ తరపున జిల్లా నేతలు.. ప్రచారానికి వస్తున్నారు.

24వ వార్డులో తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బైరిశెట్టి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గుర్తైన ఆపిల్ పండును పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

ABOUT THE AUTHOR

...view details