కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కౌటాలలో ఐదేళ్ల బాలుడు విష జ్వరంతో మృతి చెందాడు. గంగాధర్, వాణి దంపతుల మూడో సంతానమైన విజయేందర్వర్మ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకునే కుమారుడు కళ్లముందే చనిపోవటం వల్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విషజ్వరంతో ఏదేళ్ల బాలుడు మృతి... - మంచిర్యాల
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరానికి మరో ఐదేళ్ల బాలుడు బలయ్యాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే మరణించాడు.
Boy die with viral fever in kumuram bheem district