తెలంగాణ

telangana

ETV Bharat / state

Birds Walk Festival 2022: బర్డ్స్ వాక్ ఫెస్టివల్​లో.. పర్యాటకుల సందడి

Birds Walk Festival 2022: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ అడవుల్లో ప్రారంభమైన బర్డ్స్‌ వాక్‌ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభిస్తోంది. పర్యాటకులు రకరకాల పక్షుల కూతల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్నారు. 2019 డిసెంబర్‌లో తొలిసారి బర్డ్స్​వాక్‌ను నిర్వహించిన అధికారులు.... ప్రకృతి ప్రేమికుల విశేష స్పందనతో యేటా కొనసాగిస్తున్నారు.

Birds Walk Festival 2022
బర్డ్స్ వాక్ ఫెస్టివల్

By

Published : Jan 8, 2022, 11:43 AM IST

Birds Walk Festival 2022: ఒకవైపు ప్రాణహిత.. మరోవైపు పెన్‌గంగ, పెద్దవాగు నదులు ప్రవహిస్తుంటాయి. దట్టమైన అడవులు.. ఎతైన కొండలు.. జాలువారే జలపాతాలు కనువిందు చేసే ప్రకృతి అందాల్ని తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు వచ్చారు. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు అడవుల్లో కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారులు ఏర్పాటు చేసిన రెండో బర్డ్‌వాక్‌కు సందర్శకులు వచ్చారు. బర్డ్ డివిజన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 రకాల పక్షి జాతులు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది.

ఉదయం నుంచే ప్రకృతి ప్రేమికులు అటవీ అందాలు తిలకిస్తూ జలపాతాలు, పక్షుల చిత్రాలను తమ కెమెరాలలో బంధించుకుంటున్నారు. అవసరమైన చోటకు పర్యాటకులను అధికారులు జీపులో తీసుకెళ్తున్నారు. 2019 సంవత్సరంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు బర్డ్​వాక్​ను ఏటా కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. అడవుల్లో నివసిస్తూ బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో రకాల కొత్త పక్షులను గుర్తించేందుకు చాలా మంది ఔత్సాహికులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. రిజర్వాయర్ వద్ద నూతనంగా వచ్చిన పలు రకాల వలస పక్షుల గురించి ఎఫ్డీవో విజయ్ కుమార్ సందర్శకులకు వివరించారు. పర్యాటకులు బస చేసేందుకు అటవీ ప్రాంతంలోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

బర్డ్స్ వాక్ ఫెస్టివల్

ఇదీ చూడండి:Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

ABOUT THE AUTHOR

...view details