ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తక్కువ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడంతో.. ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. అధికారులు.. కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల అవస్థలు
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఓటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతుండటంతో ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు.
'పోలింగ్ కేంద్రాల్లో.. కనీసం తాగు నీరు కూడా లేదు'
రఘునాథపాలెం మండల కేంద్రంలో 1, 984 ఓటర్లు ఉండగా.. రెండు పోలింగ్ బూత్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:మహబూబాబాద్‌లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ