తెలంగాణ

telangana

ETV Bharat / state

కిటికి చువ్వలు తొలగించి బ్యాంకులో చోరీకి యత్నం

ఖమ్మం జిల్లా వైరాలో బుధవారం అర్థరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. గతంలో ఎస్​బీఐలో చోరీకి ప్రయత్నం చేయగా, తాజాగా ఆంధ్ర బ్యాంకులో దొంగతనానికి విఫలయత్నం చేశారు.

కిటికి చువ్వలు తొలగించి బ్యాంకులో చోరీకి యత్నం

By

Published : Oct 24, 2019, 11:41 AM IST

ఖమ్మం జిల్లా వైరాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్థరాత్రి ఆంధ్రా బ్యాంక్ వెనుక భాగంలో కిటికి చువ్వలు తొలగించి లోనికెళ్లారు. అంతలోనే బ్యాంకులో సైరన్ మోగడం వల్ల పరారయ్యారని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు. పది రోజుల క్రితం ఎస్​బీఐలో చోరీకి ప్రయత్నం చేయగా, తాజాగా ఆంధ్ర బ్యాంకులో మరోసారి ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించి చర్యలు ప్రారంభించారు. ఏసీపీ ప్రసన్న కుమార్, సీఐ వసంత్ కుమార్​లతో పాటు ప్రత్యేక స్క్వాడ్ బృందం దర్యాప్తు చేస్తున్నారు.

కిటికి చువ్వలు తొలగించి బ్యాంకులో చోరీకి యత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details