ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలి మడుగులో 20 రెండు పడకల గదుల ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. అర్హులను గుర్తించి లాటరీ ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 5న ఏకంగా ఎవరి అనుమతి లేకుండా కొందరు సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. తహసీల్దార్ సంజీవ, ఎస్సై నరేశ్‌కుమార్ నచ్చచెప్పేందుకు వెళ్లినా ససేమిరా అన్నారు. అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశించిన 20 మందిపై వైరా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదుచేశారు. ఇవాళ ఉదయం ఏసీపీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకొని ఇళ్లు ఖాళీ చేయించారు. కొందరు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఏసీపీ, తహసీల్దార్ గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారి సూచనలతో ఇళ్లలోకి ప్రవేశించిన వారంతా ఖాళీ చేశారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపుల్లో ఉద్రిక్తత.. మహిళల ఆత్మహత్యాయత్నం - డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపుల్లో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగులో రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపుల్లో ఉద్రిక్తత తలెత్తింది. ఇవాళ ఉదయం ఏసీపీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులతో ఖాళీ చేసేందుకు యత్నించారు. కొంతమంది మహిళలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపుల్లో ఉద్రిక్తత.. మహిళల ఆత్మహత్యాయత్నం