నేడు ఖమ్మంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మదనగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి కార్యాలయానికి ప్రజలు తరలివచ్చారు.
ఖమ్మం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
ఖమ్మం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి మదనగోపాల్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలను లోపలికి అనుమతించారు.
ఖమ్మం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను లోపలికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు.