లాక్‌డౌన్ కాలంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ రైతులు 126 ట్రాక్టర్లతో రూ. 12 లక్షల విలువైన పశుగ్రాసాని ఖమ్మంలోని గోశాలకు తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం, కల్లూరులోని 2 గోశాలలకు పశుగ్రాసాన్ని తరలించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
గోశాలలకు రూ.12 లక్షల విలువైన పశుగ్రాసం - LOCK DOWN EFFECTS
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ రైతులు రూ.12 లక్షల విలువైన పశుగ్రాసాన్ని గోశాలలకు తరలించారు. 126 ట్రాక్టర్లతో తరలిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.
గోశాలలకు రూ.12 లక్షల విలువైన పశుగ్రాసం
లాక్‌డౌన్ దృష్ట్యా ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మూగజీవాలను ఆదుకోవాలని సూచించగా... సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రూ.12 లక్షల విలువైన పశుగ్రాసాన్ని గోశాలలకు తరలిస్తున్నామన్నారు. పశుగ్రాసాన్ని తరలించడానికి సత్తుపల్లి నియోజకవర్గంలో సొంత ఖర్చుతో రైతులు చేస్తున్న కృషిని దేశం మొత్తం అభినందిస్తుందని తెలిపారు.