ఖమ్మంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులతో టీటీడీసీలో సమావేశం నిర్వహించారు. అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల రైతు బజార్లో నియంత్రణ చర్యలను పరిశీలించారు.
కరోనా నివారణ చర్యలను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.
ఖమ్మంలో పర్యటించిన మంత్రి పువ్వాడ
జిల్లా పాలనాధికారి ఆర్.వి. కర్ణన్, సీపీ ఇక్బాల్‌తో కలిసి రైతు బజార్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.