తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలాంటి ఆస్తి వివాదాలకు తావులేకుండా చేసేందుకే..

వ్యవసాయేతర ఆస్తులపై ఎలాంటి వివాదాలు, సమస్యలకు తావులేకుండా చేసేందుకు సర్వే చేపట్టినట్లు మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. దేవాలయ, వక్ఫ్, ఎన్​ఎస్పీ భూములు, చెరువు శిఖం భూముల్లో నివాసం ఉన్న వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించనున్నట్లు చెప్పారు.

puvvada ajay
ఎలాంటి ఆస్తి వివాదాలకు తావులేకుండా చేసేందుకే..

By

Published : Sep 30, 2020, 11:00 PM IST

వ్యవసాయేతర ఆస్తుల గణన ద్వారా ప్రతి పేదవాడికి శాశ్వత ఆస్తిహక్కు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. వ్యవసాయ భూముల సర్వే ద్వారా రైతులందరికీ పాసుపుస్తకాలు అందజేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్​ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఆస్తుల గణన ద్వారా వ్యవసాయేతర భూముల హక్కుదారులకు మెరూన్ కలర్ పాసుపుస్తకాలు అందిస్తామన్నారు. భవిష్యత్​లో వ్యవసాయేతర ఆస్తులపై ఎలాంటి వివాదాలు, సమస్యలకు తావులేకుండా చేసేందుకు వ్యవసాయేతర ఆస్తుల సర్వే చేపట్టినట్లు తెలిపారు. సింగరేణి భూములు, అటవీ చట్టం అమల్లో ఉన్న భూములు గిరిజనేతరులే చేతుల్లో ఉంటే వారి వివరాలు కూడా సేకరించనున్నట్లు వెల్లడించారు.

దేవాలయ, వక్ఫ్, ఎన్​ఎస్పీ భూములు, చెరువు శిఖం భూముల్లో నివాసం ఉన్న వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించనున్నట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

అనంతరం కలెక్టర్​ ఆర్​.వీ.కర్ణన్​ జన్మదినం సందర్భంగా సమావేశ మందిరంలోనే కేక్​ కోయించిన మంత్రి అజయ్​.. శుభాకాంక్షలు తెలిపారు.

ఎలాంటి ఆస్తి వివాదాలకు తావులేకుండా చేసేందుకే..

ఇవీచూడండి:ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు!

ABOUT THE AUTHOR

...view details